Header Banner

అమెరికాలో మరో విమాన ప్రమాదం కలకలం! టేకాఫ్‌కు సిద్ధమైన విమానంలో అకస్మాత్తుగా మంటలు! ఆందోళనలో ప్రయాణికులు!

  Mon Feb 03, 2025 11:16        U S A

రన్ వే పై బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో మంటలు చెలరేగాయి.. విమానం రెక్క ప్రాంతంలో పొగ, మంటలను గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. అమెరికాలోని హ్యూస్టన్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతుండడంపై ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఆదివారం హ్యూస్టన్ లోని జార్జి బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఆ విమానంలో ప్రయాణికులు అందరూ ఎక్కారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!



పైలట్లు టేకాఫ్ కు సిద్ధమవుతుండగా విమానం రెక్క ప్రాంతంలో పొగ, మంటలు ఎగిసిపడడం ప్రయాణికులు గమనించారు. ఓ ప్రయాణికురాలు మంటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఓ ప్రయాణికురాలు తనను దింపేయాలంటూ విమానంలోని సిబ్బందిని ప్రాధేయపడడం వినిపించింది. కాగా, మంటలను గుర్తించాక విమానంలోని ప్రయాణికులను దింపేసి ఫైర్ సిబ్బంది సాయంతో మంటలు ఆర్పేశామని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయం అధికారులు తెలిపారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


అమెరికాలో ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాషింగ్టన్ డీసీలో ప్రయాణికుల విమానాన్ని హెలికాప్టర్ ఢీ కొనడంతో మొత్తం 67 మంది చనిపోయిన విషయం తెలిసిందే. గత శుక్రవారం రాత్రి ఫిలడెల్ఫియాలోని ఓ షాపింగ్ మాల్ పై విమానం కూలి ఏడుగురు చనిపోయారు. మరో 19 మంది గాయపడ్డారు. తాజాగా హ్యూస్టన్ విమానాశ్రయంలో టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానంలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #flight #accident #fire #takeoff #america #todaynews #flashnews #latestupdate